: డోంట్ వర్రీ.. మీరు చేసే తప్పుల గురించి నేను మాట్లాడను: జైపూర్ పోలీసులకు క్రికెటర్ బుమ్రా కౌంటర్


జైపూర్ పోలీసుల తీరు పట్ల టీమిండియా పేస్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో తాను నోబాల్ వేస్తున్న ఫొటోను రోడ్ సేఫ్టీ ప్రచారం కోసం వాడుకోవడాన్ని బుమ్రా తప్పుబట్టాడు. ఈ యాడ్ లో బుమ్రా ఓవర్ స్టెప్పింగ్ ఫొటో ఉంది. దీంతో పాటు, 'లైన్ ను దాటకండి, ఫలితం తీవ్రంగా ఉంటుంది' అనే క్యాప్షన్ ను కూడా పెట్టారు.

నోబాల్ దెబ్బకు అసలే ఆవేదనలో ఉన్న బుమ్రా... జైపూర్ పోలీసుల యాడ్ చూసి షాక్ అయ్యాడు. తన నిరసనను ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. దేశం కోసం ఎంతో చేసే మీకు ఎలాంటి గౌరవం లభిస్తోందో దీని ద్వారా తెలుస్తోందని ట్వీట్ చేశాడు. మీరు చేసే తప్పులను తాను ఎత్తి చూపనని... వర్రీ కావద్దని అన్నాడు. మనుషులు తప్పులు చేయడం సహజమే అని చెప్పాడు.  

  • Loading...

More Telugu News