: భారత్ లో విద్వేష దాడి... ముస్లిం యువకులను చావబాదిన హిందూ యువకులు.. ఒకరి మృతి!
పాశ్చాత్యదేశాల్లో భారతీయులపై విద్వేష దాడి జరిగిందని పత్రికల్లో చదివి ఆవేశపడే చాలా మంది... స్వదేశంలో మాత్రం విద్వేషాలకు దూరంగా ఉండడం లేదు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి మధుర వెళ్తున్న ట్రైన్ లో దారుణం చోటుచేసుకుంది. ట్రైన్ లో నలుగురు ముస్లిం యువకులు కూర్చుని ప్రయాణిస్తున్నారు. అంతలో అక్కడికి 15 మంది గుంపు వచ్చి సీట్లు తమకిచ్చి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దానికి ఆ నలుగురు ముస్లిం యువకులు నిరాకరించారు.
సీట్లు తమవని, అలా వెళ్లాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. దీంతో ఆగ్రహానికి గురైన ఓ హిందూ యువకుడు వారిని గొడ్డు మాసం తినేవారిగా సంబోధించాడు. దీనిని వారు వ్యతిరేకించారు. దీంతో ఆ 15 మంది కలిసి ఆ నలుగురినీ గొడ్డును బాదినట్టు బాదారు. అంతేకాదు, జునైద్ అనే 17 ఏళ్ల యువకుడ్ని కత్తితో పొడిచి చంపేశారు. అతని సోదరుడితో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో షాకిర్ (23) అనే యువకుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.