: పవిత్ర మక్కాపై దాడికి యత్నం... ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సౌదీ పోలీసులు
ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే మక్కా మసీదులో విధ్వంసానికి ఉగ్రవాదులు వ్యూహరచన చేశారు. మూడు ఉగ్రవాద బృందాలు ఈ పథకంలో పాలుపంచుకున్నట్టు సౌదీ అరేబియా పోలీసులు గుర్తించారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని లక్షలాదిమంది ముస్లింలు వివిధ దేశాల నుంచి మక్కాకు చేరుకుంటారు. ప్రతి ముస్లిం జీవితంలో ఒక్కసారైనా మక్కాను సందర్శించాలన్న నిబంధనలో భాగంగా భారీ సంఖ్యలో ముస్లింలు పవిత్ర ప్రార్థనల్లో పాలుపంచుకుంటారు.
అనంతరం కాబాను సందర్శించి, జీవితం ధన్యమైందన్న ఆనందంతో తిరిగి ఇంటికి వెళ్తారు. ఈ నేపథ్యంలో, లక్షలాది మంది ప్రార్థనల్లో పాల్గొనే సమయంలో విరుచుకుపడాలని ఉగ్రవాదులు వ్యూహం రచించారు. దీనిని గుర్తించిన సౌదీ పోలీసులు ఉగ్రవాదులు తలదాచుకున్న భవనాన్ని గుర్తించి దాడులు చేశారు. దీనిని గుర్తించిన ఒక ఉగ్రవాది తనను తాను పేల్చేసుకోవడంతో భవనం పాక్షికంగా దెబ్బతినగా, ఐదుగురు పోలీసులు సహా 11 మంది గాయపడ్డారు. దీంతో ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒక మహిళ కూడా ఉండడం విశేషం.