: 230 అడుగుల లోతులో పాప... గుండెలవిసేలా రోదిస్తున్న తల్లిదండ్రులు!


రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఇక్కారెడ్డి గూడెంలో బోరుబావిలో పడిన 14 నెలల చిన్నారి మీనా 36 గంటలుగా బోరుబావిలో చిక్కుకుపోయింది. తొలుత 40 అడుగుల అగాధంలోకి జారిపోయిందని గుర్తించి నిపుణులు వెలికి తీసే ప్రయత్నంలో 230 అడుగుల లోతుకు జారిపోయినట్టు గుర్తించారు. మొన్న సాయంత్రం 6:20 నిమిషాలకు పాప బోరుబావిలోకి జారిపోగా, అప్పటి నుంచి పాపను బయటకు తీయడానికి ఎన్డీఆర్ఎఫ్ నిపుణులు, ఎల్ అండ్ టీ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, సీఐఎస్ఎఫ్, రెవెన్యూ ఉద్యోగులు నిర్విరామంగా శ్రమిస్తున్నారు.

పాప క్షేమంగా రావాలని గ్రామస్థులు ప్రార్థనలు చేస్తున్నారు. అయినా పాప ఇంకా బోరుబావిలోంచి బయటకు రాకపోవడంతో అంతా ఆందోళన చెందుతున్నారు. మీనా తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. నిపుణులు చేపట్టిన చర్యలంతా విఫలం కావడంతో, బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నారు. సీసీ కెమెరాలతో పాపచేతి కదలికలు గమనిస్తూ సహాయకచర్యల్లో వేగం పెంచారు.

  • Loading...

More Telugu News