: ‘డీజే’ ప్రేక్షకుల మనసులు దోచుకుంది: దర్శకుడు హరీష్ శంకర్
‘డీజే: దువ్వాడ జగన్నాథం’ చిత్రం ప్రేక్షకుల మనసులు దోచుకుందని ఆ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ అన్నారు. ఈ చిత్రం ఈ రోజు విడుదలైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘డీజే’ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలని, అల్లు అర్జున్ కెరీర్ లో అత్యధిక గ్రాస్ వసూలు చేసే చిత్రంగా ఇది నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘డీజే’లో అల్లు అర్జున్ నటన ఆకట్టుకుందని, బ్రాహ్మణ యువకుడిగా బాగా నటించాడని హరీష్ శంకర్ కితాబిచ్చాడు.