: పాకిస్థాన్ లో జంట పేలుళ్లు..18 మంది మృతి


పాకిస్థాన్ లో జంట పేలుళ్ల కారణంగా 18 మంది మృతి చెందగా, 100 మంది గాయాలపాలయ్యారు. పాక్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులో ఉండే కుర్రం జిల్లాలోని పరచినార్ గిరిజన ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. మొదటి బాంబు పేలుడు.. పరచినార్ ఏజెన్సీ ప్రాంతంలోని అక్బర్ ఖాన్ మార్కెట్ లో సంభవించింది. రంజాన్ మాసం కావడంతో షాపింగ్ నిమిత్తం అక్కడికి వచ్చిన ప్రజలతో ఆ ప్రాంతం కిటకిటలాడుతున్న తరుణంలో ఈ దారుణం జరిగినట్టు అధికారులు తెలిపారు. మొదటి బాంబు పేలుడులో గాయపడ్డవారిని కాపాడేందుకు కొంత మంది వెళ్లిన సందర్భంలో రెండో బాంబు పేలింది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News