: రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే విషయం నాకు తెలియదు: పన్నీర్ సెల్వం
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే విషయం తనకు తెలియదని అన్నాడీఎంకే నేత, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నారు. బీజేపీ ఆహ్వానం మేరకు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం ఆయన ఢిల్లీ వెళ్లారు. అనంతరం, మీడియాతో పన్నీర్ సెల్వం మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చని, రజనీ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతిస్తామని చెప్పారు.