: వరుణ్ తేజ్ కొత్త సినిమా ట్రైలర్ విడుదల.. ‘ఫిదా’ అయిపోతున్న అభిమానులు
మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తోన్న కొత్త సినిమా ఫిదా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమాకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అమెరికా కుర్రాడిగా వరుణ్ తేజ్ లుక్ అదిరిపోయింది. సాయి పల్లవి తెలంగాణ అమ్మాయిగా మాట్లాడుతున్న తీరు థియటర్లలో ప్రేక్షకులతో విజిల్స్ వేయించే విధంగా ఉంది. శక్తి కాంత్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ టీజర్ ఇటీవలే విడుదలైంది. ప్రేక్షకులకి ఈ ట్రైలర్ నచ్చుతుందని తాను భావిస్తున్నట్లు తెలుపుతూ హీరో వరుణ్ తేజ్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ ట్రైలర్‌ను ఉంచాడు.