: మోదీపై వ్యతిరేక వ్యాఖ్యల వీడియో ‘షేర్’ చేస్తున్న ముస్లిం యువకుడి అరెస్టు!


ప్రధాని మోదీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఓ వీడియోను ‘వాట్సాప్’ ద్వారా షేర్ చేస్తున్న ఒక ముస్లిం యువకుడిని జార్ఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ లో ఇరవై రెండేళ్ల సమీర్ అన్సారీ మోదీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో పాక్ తో భారత్ తలపడటానికి ముందు ఈ వీడియో క్లిప్ ను చిత్రీకరించారు. ఈ వీడియోలో పాకిస్థాన్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన సమీర్ అన్సారీ, అదే సమయంలో భారత్ ను కించపరిచే విధంగా మాట్లాడాడనే ఆరోపణల నేపథ్యంలో అతన్ని అరెస్టు చేసినట్టు సాహిబ్ గంజ్ ఎస్పీ పి.మురుగన్ పేర్కొన్నారు. ఈ వీడియోలో అన్సారీ మాట్లాడుతుండగా, మరో వ్యక్తి చిత్రీకరించాడని, ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కాగా, ఈ వీడియోను సాహిబ్ గంజ్ ప్రాంతంలో ఎక్కువగా షేర్ చేశారు.

  • Loading...

More Telugu News