: చంద్రబాబుకు మతి భ్రమించింది: వైసీపీ ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డి
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు మతి భ్రమించిందని, ఆయన్ని వెంటనే పిచ్చాసుపత్రికి పంపించాలని అన్నారు. టీడీపీకి ఓట్లు వేయకుంటే రేషన్ కట్ చేస్తామని చంద్రబాబు అనడం దుర్మార్గమని, సీఎం పదవిలో ఉన్న ఆయన బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ ఓడిపోతుందని చంద్రబాబు భయపడుతున్నారని, అభద్రతాభావంలో ఉన్నారని విమర్శించారు.