: అబు బాకర్ అల్ బాగ్దాదీ కచ్చితంగా మరణించాడు: రష్యా డిఫెన్స్ కమిటీ
ఉగ్రవాద సంస్థ ఐసిస్ అధినేత అబు బాకర్ అల్ బాగ్దాదీ వంద శాతం మరణించి ఉంటాడని రష్యా పార్లమెంట్‌కు చెందిన డిఫెన్స్ కమిటీ ప్రతినిధి తెలిపారు. సిరియాలోని రఖ్ఖా ప్రాంతంలో ఐసిస్ స్థావరాలపై ఇటీవల తాము నిర్వహించిన వైమానిక దాడుల్లో అల్ బాగ్దాదీ కూడా హతమై ఉంటాడని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అభిప్రాయపడుతోంది. కానీ ఆ ప్రాంతాల్లో గస్తీ కాసిన సాయుధ దళాలు, అమెరికా మిలటరీ అధికారులు మాత్రం ఈ విషయంపై సందేహం వ్యక్తం చేస్తున్నారు.
2014లో మోసుల్‌లోని ఓ మసీదు నుంచి తనను తాను బాగ్దాదీ ఖలీఫాగా ప్రకటించుకున్నప్పటి నుంచి ఆయన మరణంపై వివిధ వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ వాటిలో ఎంత వాస్తవం ఉందనే విషయం మాత్రం ఇప్పటికీ తెలియరాలేదు.