: ఎంతో ఇష్టంగా తింటున్న నూడుల్స్‌ లో పాము పిల్లను చూసి షాకైన విద్యార్థిని!


చిన్నారులు, యూత్ ఎంతో ఇష్ట‌ప‌డి తినే నూడుల్స్ స‌న్న‌గా వాన‌పాములా ఉంటాయ‌న్న విష‌యం తెలిసిందే. అయితే, నూడుల్స్ తింటున్న స‌మ‌యంలో అందులో నిజంగానే సన్నని పాముపిల్ల క‌నిపించిన ఘ‌ట‌న చైనాలోని గాంగ్జీ విశ్వవిద్యాలయంలోని క్యాంటీన్‌లో చోటు చేసుకుంది.

 ఆక‌లితో ఉన్న ఓ విద్యార్థిని క్యాంటిన్‌కి వ‌చ్చి నూడుల్స్  ఆర్డ‌ర్ ఇచ్చి, అవి తెచ్చివ్వ‌గానే గ‌బ‌గ‌బా తినడం ప్రారంభించింది. అయితే, ఒక్కసారిగా ఆ నూడుల్స్‌ మధ్యలో ఓ స‌న్న‌ని పాము పిల్ల క‌న‌ప‌డ‌డంతో షాక్ అయింది. ఈ విష‌యాన్ని క్యాంటీన్ యాజమాన్యానికి తెల‌ప‌గా వారు పట్టించుకోలేదు. దీంతో ఆమె ఆ పాము పిల్ల ఫోటోలు తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డంతో ఈ వార్త వైర‌ల్ గా మారింది. చివ‌రికి ఈ పోస్ట్‌ అక్క‌డి అధికారుల దృష్టికి వెళ్ల‌డంతో ఆ క్యాంటీన్‌‍లో సోదాలు నిర్వ‌హించారు. 

  • Loading...

More Telugu News