: హిందూపురంలో బాలయ్య... మూడు రోజులు అక్కడే మకాం!


ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ రోజు తన సొంత నియోజకవర్గం హిందూపురంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కామినేని శ్రీనివాస్ తో కలసి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని మాతాశిశు ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఆయన హిందూపురంలోనే ఉండనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను ఎక్కడున్నా తన నియోజకవర్గ ప్రజల బాగు కోసం ఆలోచిస్తుంటానని చెప్పారు. హిందూపురం ప్రజల దాహార్తిని తీర్చేందుకోసం త్వరలోనే హంద్రీనీవా నీటిని తీసుకొస్తానని తెలిపారు. సినిమా షూటింగ్ కోసం కొన్ని రోజులు నియోజకవర్గానికి దూరమయ్యానని చెప్పారు. 

  • Loading...

More Telugu News