: ఆఫ్గన్, ఐర్లాండ్ లకు ఘనమైన హోదాను ఇచ్చిన ఐసీసీ
ఇటీవలి కాలంలో పెద్ద జట్లపైనా సంచలన విజయాలు సాధిస్తూ, అంచనాలు మించి రాణిస్తున్న అఫ్గనిస్థాన్, ఐర్లాండ్ జట్లకు ఘనమైన టెస్టు హోదా కల్పిస్తూ, లండన్ లో జరిగిన ఐసీసీ వార్షిక సర్వసభ్య సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో ఆఫ్గన్, ఐర్లాండ్ లకు పూర్తి సభ్యత్వాన్నీ ఇస్తున్నట్టు ఐసీసీ ప్రకటించింది. ఈ రెండు జట్ల చేరికతో టెస్టు మ్యాచ్ లు ఆడే దేశాల సంఖ్య 12కు పెరిగింది. ఐసీసీ ఏజీఎంలో రెండు దేశాలకూ టెస్ట్ హోదాపై సభ్య దేశాలన్నీ ఏకగ్రీవ ఆమోదం పలకడం గమనార్హం. ఏ దేశమూ అభ్యంతరాలను వ్యక్తం చేయలేదని ఐసీసీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా, ఐర్లాండ్ కు 2005లో ఆఫ్గనిస్థాన్ కు 2009లో వన్డే హోదా దక్కిందన్న సంగతి విదితమే.