: మరో కొత్త ఫీచర్ ను తీసుకొస్తున్న వాట్సాప్!


తమ వినియోగదారుల కోసం మరో అద్భుతమైన ఫీచర్ ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకురానుంది. యూపీఐ సహాయంతో వాట్సాప్ ద్వారా నగదును బదిలీ చేసుకునే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే ఈ విషయమై దేశీయ బ్యాంకులు, ఇతర సంస్థలతో చర్చలను ప్రారంభించింది. ఈ సదుపాయం అమల్లోకి వస్తే, యూపీఐ ద్వారా వాట్సాప్ ను ఉపయోగించి రెండు బ్యాంక్ అకౌంట్ల మధ్య మనీ ట్రాన్స్ ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, నగదు చెల్లింపులు కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం వాట్సాప్ కు భారత్ లో 20 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. వీరి సంఖ్యను మరింత పెంచుకునే క్రమంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది వాట్సాప్. 

  • Loading...

More Telugu News