: సల్మాన్ కు షాక్....'ట్యూబ్ లైట్' లో కీలక సన్నివేశం లీక్!


ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు షాక్ తగిలింది. సల్మాన్ ఖాన్ తమ్ముడు సొహైల్ ఖాన్ నిర్మించిన 'ట్యూబ్ లైట్' సినిమాలో కీలక సన్నివేశం సోషల్ మీడియాలో లీకైంది. భారీ బడ్జెట్ తో రూపొందించిన 'ట్యూబ్ లైట్' సినిమాలో షారూఖ్ ఖాన్ అతిథిపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్ లో షారూఖ్ సిగ్నిఫికెంట్ పోజ్ తో కనిపిస్తాడు. దీంతో ఈ సినిమాలో షారూఖ్ ఉన్నాడని భావించినా, చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వకుండా సీక్రెట్ గా ఉంచింది. అయితే సోషల్ మీడియాలో లీకైన సీన్ తో ఈ సినిమాలో షారూఖ్ అతిథి పాత్ర పోషించాడని అర్ధమైంది.

ఇంద్రజాలికుడిగా షారూఖ్ నటించగా, సల్లూ భాయ్ అతనిని అనుకరించే ప్రయత్నం చేసే సీన్ లీకైంది. సినిమాలో ఈ సీన్ కీలకమైనది. సల్మాన్, షారూఖ్ గతంలో మంచి స్నేహితులు. విభేదాల కారణంగా చాలా కాలం దూరంగా ఉన్నారు. బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ వీరిద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉండేవారు. ఇటీవలే వీరిద్దరూ కలిశారు. సల్మాన్ తన చెల్లెలు అర్పిత పెళ్లికి ఆహ్వానించినప్పటి నుంచీ ఇద్దరి మధ్య బంధం మళ్లీ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి జోడీ సినిమాకు కీలకం కానుందని సల్లూభాయ్ భావించగా, సోషల్ మీడియాలో లీకై సంచలనం రేగింది.

  • Loading...

More Telugu News