: ఔటర్ రింగ్ రోడ్డుపై తగులబడ్డ అంబులెన్స్... సగం కాలిపోయిన మృతదేహం!


హైదరాబాదులోని ఔటర్ రింగ్ రోడ్డుపై అంబులెన్స్ తగులబడింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని హైదరాబాదు నుంచి రాజమండ్రి తరలిస్తుండగా, అంబులెన్స్ లో మంటలు చెలరేగాయి. దీనిని గుర్తించిన సిబ్బంది, మృతుడి బంధువులు అంబులెన్స్ నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. క్షణాల్లో అంబులెన్స్ మంటల్లో చిక్కుకుపోయింది. దీంతో అంబులెన్స్ లోని మృతదేహం సగం కాలిపోయింది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని సిబ్బంది చెబుతున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. 

  • Loading...

More Telugu News