: బీజేపీ ఎమ్మెల్యే ఫేస్ బుక్ ఖాతాలో అశ్లీల వీడియో...తనకు తెలియదన్న ఎమ్మెల్యే


ఉత్తరప్రదేశ్ లోని ఇగ్లాస్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే రాజ్ వీర్ దిలేర్ ఫేస్‌ బుక్ ఖాతాలో అశ్లీల వీడియో పోస్టు అయింది. రాత్రి 11.30 గంటల సమయంలో ఆ వీడియో పోస్టు కాగా, ఆయన అనుచరులు ఆయనకు సమాచారం అందించారు. దీంతో ఆ వీడియో తాను పోస్టు చేయలేదని వివరణ ఇచ్చి, తన అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేసి, అశ్లీల వీడియో పోస్టు చేశారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన అలీఘడ్ ఎస్పీ రాజేష్ కుమార్ పాండేకు ఫిర్యాదు చేశారు.

 రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా జరిగిన బీజేపీ సమావేశంలో పాల్గొని తాను రాత్రి రెండు గంటలకు వచ్చానని, అయితే తన అనుచరులు చెప్పడంతో దానిని నిర్ధారించి, ఆ వీడియోను డిలీట్ చేశానని చెప్పారు. దీంతో ఫిర్యాదు స్వీకరించిన ఎస్పీ ఐపీ అడ్రెస్ ఆధారంగా దర్యాప్తు చేసి, నిందితుడిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

  • Loading...

More Telugu News