: అచ్చం మనిషిలా... వ్యాన్ డోర్ తీసి డ్రైవర్ సీట్లో కూర్చుని, ఆహారం వెతుక్కున్న ఎలుగు బంటి... వీడియో చూడండి!


అచ్చం మనిషిలా కార్టూన్ ఛానెళ్లలో చూపించేలా ఎలుగుబంటి ఒక వ్యాన్ డోర్ తెరిచి, వ్యాన్ ఎక్కి, అందులో ఆహారం కోసం గాలించి, డ్రైవర్ సీట్లో కూర్చుని, దిగి అడవిలోకి వెళ్లిపోయిన ఘటన కెనడాలో చోటుచేసుకోగా... దానిని వీడియో తీసిన వ్యక్తి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో దానిని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... కెనడాలోని ఓ అటవీ ప్రాంతానికి సమీపంలో తన వ్యాన్ ను పార్కింగ్ చేసిన పీటర్సన్... దానికి కొద్ది దూరంలో స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తున్నారు.

 ఇంతలో ఒక ఎలుగు బంటి వ్యాన్ దగ్గరకు రావడాన్ని ఒక స్నేహితుడు గమనించి, పీటర్సన్ కు చూపించగా, దానిని ఆయన వీడియో తీశారు. వ్యాన్ సమీపించిన ఎలుగు బంటి అచ్చం మనిషిలా వ్యాన్ డోర్ తెరిచింది. వ్యాన్ లోపలికి తొంగి చూసి ఆహారం కోసం వెతికింది. ఏమీ కనిపించకపోవడంతో వ్యాన్ ఎక్కింది. డ్రైవర్ సీట్లో కూర్చుంది. మళ్లీ వ్యాన్ మొత్తం వెదికింది. ఈ సారి దానికి వాటర్ బాటిల్ కనిపించింది. సుమారు 12 నిమిషాలు వ్యాన్ లోనే గడిపింది. అనంతరం మళ్లీ వ్యాన్ దిగి తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ఈ తతంగం మొత్తాన్ని వీడియో తీసిన పీటర్సన్ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయగా దానిని ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ఆ వీడియోను మీరు కూడా చూడండి. 

  • Loading...

More Telugu News