: స్పందన లేని చిన్నారి... కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు... విషణ్ణవదనాలతో స్థానికులు!


రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం ఇక్కారెడ్డి గూడెంలో బోరుబావిలో పడిన 14 నెలల చిన్నారి మీనా అచేతనంగా మారింది. నిన్న సాయంత్రం 6:20 నిమిషాలకు 40 అడుగుల అగాధంలోకి ఆ చిన్నారి జారిపోయిన విషయం తెలిసిందే. పాపను బయటకు తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, సీఐఎస్ఎఫ్, రెవెన్యూ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కొచ్చి నుంచి నిపుణులు కూడా వస్తున్నారు. నిర్విరామంగా పాపకు ఆక్సిజన్ అందేలా ఏర్పాట్లు చేశారు. బోరుబావి ఇరుగ్గా ఉండడంతో రోబో హ్యాండ్ పాపను పట్టుకోవడంలో విఫలమైంది. దీంతో పాప స్పృహ కోల్పోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. పాపలో కదలిక లేదని తెలియడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు విషాదంలో మునిగిపోయారు. మీనా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

  • Loading...

More Telugu News