: రజనీతో పొత్తుకు సిద్ధమే: పన్నీర్ సెల్వం
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశంపై తమిళనాట ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీ రాజకీయాల్లోకి వస్తే ఆయనతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తెలిపారు.
ఈ మేరకు ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రజనీ రాజకీయ రంగప్రవేశంపై ఇంకా స్పష్టమైన ప్రకటన చేయలేదని అన్నారు. అయితే భవిష్యత్ లో ఆయన రాజకీయాల్లోకి వస్తే కనుక ఆయనతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పళని స్వామి ఇంకా శశికళ అడుగుజాడల్లోనే నడుస్తున్నాడని, తాము మాత్రం పార్టీ, ప్రభుత్వాన్ని ప్రజలకు నచ్చేవిధంగా, ప్రజలు మెచ్చే విధంగా నడిపించాలని కోరుతున్నామని ఆయన తెలిపారు. అయితే అటునుంచి మాత్రం ఎలాంటి స్పందన రావడం లేదని ఆయన చెప్పారు.