: ఏపీ కేబినెట్ లో ముస్లింలకు ఎందుకు అవకాశమివ్వలేదు?: చంద్రబాబుపై సీపీఐ నేత విమర్శలు


ఏపీ కేబినెట్ లో ముస్లిం మైనార్టీలకు స్థానం ఇవ్వని  సీఎం చంద్రబాబు.. నంద్యాలలో లక్షలు ఖర్చు చేసి ఇఫ్తార్ విందు మాత్రం ఇచ్చారని, త్వరలో జరగనున్న ఉపఎన్నికల కోసమే ఇంత ఖర్చు పెట్టారని సీపీఐ నేత రామకృష్ణ విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత మూడేళ్లుగా ముస్లిం మైనార్టీలకు తన కేబినెట్ లో ఎందుకు స్థానం కల్పించలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. తాను తలచుకుంటే ఓటుకు రూ.5 వేలు పంచగలనని చంద్రబాబు చెప్పడం దారుణమని అన్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో లక్షలాది రూపాయలు పంచి పెట్టి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను చంద్రబాబు కొనుగోలు చేశారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News