: ఏనుగుతో సెల్ఫీ కోసం ప్రయత్నించిన ఐదుగురు యువకులు... తరిమిన గజరాజు!
సెల్ఫీ మోజులో ఐదుగురు యువకులు ఏనుగు ముందు చేరి తమ స్మార్ట్‌ఫోన్‌కు పనిచెప్పిన ఘటన నీలగిరి జిల్లా ముదుమలై పులుల అభయారణ్యంలో చోటు చేసుకుంది. అయితే, ఆ ఏనుగు ఒక్కసారిగా వారి వెంట పడడంతో పరుగు లంకించుకుని సఫారి వాహనంలో ఎక్కి ఆ యువకులు పారిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన అటవీ శాఖ అధికారులు ఆ ఐదుగురు యువకులకు రూ.10 వేల చొప్పున జరిమానా విధించారు. ఈ ప్రాంతంలో వన్య ప్రాణులను ఫోటోలు తీయడం నేరమని చెప్పారు. అటువంటిది ఆ యువకులు ఏకంగా ఏనుగువద్ద వాహనం నుంచి కిందకు దిగి సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారని అన్నారు.