: జగన్ కు 24 గంటల టైమిచ్చి మరీ సవాల్ చేస్తున్నా!: నారా లోకేశ్ ట్వీట్


ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహ‌న్‌రెడ్డికి 24 గంటల టైమిచ్చి మరీ సవాల్ చేస్తున్నాన‌ని ఏపీ మంత్రి నారా లోకేశ్ ఈ రోజు తెలుగులో ట్వీట్ చేశారు. దమ్ముంటే త‌న‌పై చేసిన ఆరోపణలను నిరూపించాలని, వైసీపీకి ఇలా సవాల్ విసరడం మూడోసారని అన్నారు. ‘ఆధారాలు చూపించమంటే పారిపోతారెందుకు? మళ్ళీ అడుగుతున్నా, బహిరంగ చర్చకు సిద్ధమా? ముఖ్యమంత్రి కొడుకైనంత మాత్రాన అందరూ నీలా ప్రజల సొమ్ము దోచుకుంటారా? నీ పచ్చ కామెర్ల కంటితో చూసి ఆరోపణలు చేయకు. మాది కీర్తి సంపాదన. నీది అవినీతి సంపాదన’ అని లోకేశ్ ట్విట్ట‌ర్‌లో మండిప‌డ్డారు.

  • Loading...

More Telugu News