: ఆస్ట్రేలియా ఓపెన్ లో దూసుకెళుతున్న మనోళ్లు.. భారత్ నుంచి క్వార్టర్స్ కు సైనా, పీవీ సింధు, సాయి ప్రణీత్, కిదాంబి శ్రీకాంత్


సిడ్నీలో జ‌రుగుతున్న‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత షట్ల‌ర్లు అద‌ర‌హో అనిపిస్తున్నారు. భారత్ నుంచి ఇప్ప‌టికే పీవీ సింధు, సాయి ప్రణీత్, కిదాంబి శ్రీకాంత్ లు క్వార్టర్స్ చేరుకోగా, మ‌రో హైద‌రాబాదీ సైనా నెహ్వాల్ కూడా మహిళల సింగిల్స్ లో విజ‌య దుందుభి మోగించింది. 21-15, 20-22, 21-14 తేడాతో మలేషియా షట్లర్ సోనియా చెహపై గెలుపొందింది. తొలి గేమ్ లో సులువుగా గెలిచిన‌ సైనా రెండో గేమ్ లో కాస్త క‌ష్ట‌పడింది. అయితే, మ్యాచ్ పాయింట్ వద్ద తప్పిదాల కారణంగా సైనా గేమ్ కోల్పోవడంతో.. నిర్ణయాత్మక మూడో గేమ్ నిర్వ‌హించారు. ఇందులో అద్భుతంగా రాణించిన సైనా విజ‌య‌ఢంకా మోగించింది.        

  • Loading...

More Telugu News