: తన పెళ్లి వేడుకలో డ్యాన్స్ ఆదరగొట్టిన అందాల సుందరి... ఇదిగో చూడండి!
తన పెళ్లి 'సంగీత్'లో చక్కని డ్యాన్స్ చేసి అందరినీ అలరించింది మాజీ మిస్ ఇండియా యూఎస్ఏ నటాషా అరోరా. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇటీవల యూఎస్ లోని టెక్సాస్ లో ఈ వేడుక జరగగా 'ప్రేమ్ రతన్ దన్ పాయో' వంటి బాలీవుడ్ పాటలకి ఈ అమ్మడు అదిరిపోయే స్టెప్స్ వేసింది. ఈ వీడియోను ఒక్క రోజులోనే లక్ష మంది చూశారు. దీనిపై స్పందిస్తోన్న నెటిజన్లు నేటితరం అమ్మాయి, మోడ్రన్ పెళ్లికూతురు, పెళ్లి కూతురా మజాకా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ పెళ్లి కూతురి డ్యాన్స్ ను మీరూ చూడండి...