: కేసీఆర్, కేటీఆర్, హరీష్, తుమ్మల నియోజకవర్గాల్లోనే డబుల్ బెడ్ రూమ్ పనులు వేగంగా జరుగుతున్నాయ్: మంత్రి ఈటల
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, తుమ్మల నాగేశ్వరరావుల నియోజకవర్గాల్లోనే డబుల్ బెడ్ రూమ్ ల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ రోజు ఆయన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇళ్లను త్వరగా నిర్మించాలని ప్రజలు కోరుతున్నప్పటికీ... కాంట్రాక్టర్లు మాత్రం పూర్తి స్థాయిలో సహకరించడం లేదని అన్నారు. కాంట్రాక్టర్లు సహకరించకపోయినప్పటికీ ఏడాది లోపల ఇళ్లను నిర్మిస్తామని అన్నారు.