: అదే అమ్మాయితో కలిసి నేను నటిస్తానని అనుకోలేదు: సల్మాన్ ఖాన్


కబీర్ ఖాన్ దర్శకత్వంలో సల్మాన్ హీరోగా నటించిన ‘ట్యూబ్ లైట్’ చిత్రం రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా ముంబయిలో జరిగిన చిత్ర ప్రచార కార్యక్రమంలో సల్మాన్ తో, కరీనా చిన్నపిల్లగా ఉన్న నాటి ఫొటోను వ్యాఖ్యాత చూపించి కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ ఫొటో గురించి సల్మాన్ ప్రస్తావిస్తూ, కరీనా కపూర్ కు అప్పుడు తొమ్మిదేళ్ల వయస్సు అని, అప్పటికే పెద్ద స్టార్ లా ఉందని అన్నారు. నాడు ఉడిపిలో ఈ ఫొటో దిగామని, సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకున్నామని చెప్పారు. కట్ చేస్తే.. అదే అమ్మాయి సరసన ‘బాడీగార్డ్’, ‘భజరంగీ భాయ్ జాన్’ చిత్రాల్లో నటిస్తానని ఎన్నడూ ఊహించలేదని సల్మాన్ చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News