: ఓ పాటలో బట్టలు కాలిపోతే.. 'బుట్టలు' ధరించాం!: కత్రినా, రణ్ బీర్
బాలీవుడ్ అందాల నటి కత్రినా కైఫ్, రణ్ బీర్ జంటగా నటించిన ‘జగ్గా జాసూస్’ వచ్చే నెల 14న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ముంబయిలో నిర్వహించిన చిత్ర ప్రచార కార్యక్రమంలో కత్రినా,రణ్ బీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘ఝమ్రితలయా’ అనే ఓ పాటను వినూత్నంగా చిత్రీకరించిన విషయాన్ని వారు ప్రస్తావించారు. ఈ పాటలో తాము ధరించిన దుస్తులు మంటల్లో కాలిపోతాయని, దీంతో, ఈ పాట మొత్తం తాము బుట్టలు ధరించే ఉంటామని చెప్పుకొచ్చారు. కాగా, అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మరో ప్రత్యేకత ఏంటంటే..ఇందులో మొత్తం 20 పాటలు ఉండటం!