: రైతులకు రుణమాఫీ చేయడం ఫ్యాషన్ గా మారిపోయింది: వెంకయ్యనాయుడు
రైతులకు రుణ మాఫీ చేయడం ఫ్యాషన్ గా మారిపోయిందంటూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలు చేశారు. అత్యంత కఠిన పరిస్థితులు నెలకొన్నప్పుడే రుణమాఫీ చేయాలి తప్పా, ఇదే తుది పరిష్కారం కాదని అన్నారు. రుణమాఫీ వల్ల ఆర్థిక పరిస్థితుల్లో ఒత్తిడి కలిగే అవకాశం ఉంటుందని ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన అన్నారు.
కాగా, ఈ వ్యాఖ్యలపై సీపీఎం నేత సీతారాం ఏచూరి మండిపడ్డారు. రుణమాఫీ చేయడాన్ని ఫ్యాషన్ అని వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించడం రైతులను అవమానపరిచే విధంగా ఉందని అన్నారు. ఇదిలా ఉండగా, రూ.50 వేల లోపు రైతు రుణాలను మాఫీ చేస్తున్నట్టు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు, యూపీ, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలు రుణమాఫీ చేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం.