: ఇప్పటికీ ఆయన నన్ను గాఢంగా ప్రేమిస్తున్నారు: బోనీ కపూర్ గురించి శ్రీదేవి
బోనీ కపూర్‌లాంటి నిర్మాతను తాను ఇంతవరకు చూడలేదని సినీనటి శ్రీదేవి అన్నారు. ఆమె నటించిన కొత్త సినిమా ‘మామ్’ విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... బోనీ కపూర్ లేకుండా ‘మామ్’ సినిమా సాధ్యమయ్యేది కాదని తెలిపారు. ఈ సినిమా విషయంలో నటీనటుల ఎంపిక, వారిని సెట్‌లో ఉత్సాహపరచడం వంటి ఎన్నో విషయాల్లో ఆయన ప్రత్యేక దృష్టిపెట్టారని చెప్పారు. తాను బోనీ కపూర్‌తో ఏ విషయాన్నీ దాచిపెట్టబోనని అన్నారు. తన భర్త ఇప్పటికీ తనను గాఢంగా ప్రేమిస్తున్నాడని, ఆ విషయమే తనకు ప్రత్యేక అనుభూతిని ఇస్తుంటుందని తెలిపారు. తాను కూడా బోనీని ఎంతగానో ప్రేమిస్తున్నానని చెప్పారు. ఆయనపై ప్రేమ రోజురోజుకీ పెరుగుతూనే వస్తోందని అన్నారు. తన భర్త తనను ఎప్పుడూ నవ్విస్తుంటారని తెలిపింది.