: అనసూయా! ఆ వార్త నిజమేనా?: అభిమాని ప్రశ్న


తెలుగు బుల్లితెరపై క్రేజీ యాంకర్ గా పేరుతెచ్చుకున్న అనసూయ గురించిన వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి. వాటిపై అభిమానులు నేరుగా ఆమెనే అడిగి సందేహాలు తీర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అనసూయను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్నావటగా నిజమేనా? అంటూ ఓ అభిమాని ప్రశ్నించాడు.

దానికి అనసూయ సమాధానమిస్తూ, ‘చాలా రోజులుగా నా గురించి ఎటువంటి వార్తలూ రాకపోయేసరికి ఇలాంటి కొత్త వార్త పుట్టించారు. నేను ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుంటున్నాననడం పూర్తిగా అబద్ధం. నన్ను సంప్రదించకుండా ఇష్టమొచ్చినట్టు వార్తలు రాసేస్తున్నారు. అయినా ప్లాస్టిక్‌ సర్జరీలాంటి షార్ట్‌ కట్స్‌ ను నేను నమ్మను’ అని సూటిగా చెప్పింది.  

  • Loading...

More Telugu News