: డైరెక్టర్ హరీష్ శంకర్ కు నేను ఒక్కటే చెప్పా: అల్లు అర్జున్


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'దువ్వాడ జగన్నాథం' సినిమా భారీ అంచనాల మధ్య రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. గతంలో ఏ సినిమాలో కనిపించని విధంగా, కొత్త గెటప్ లో బన్నీ అభిమానుల ముందుకు వస్తున్నాడు. ఈ సందర్భంగా ఓ మీడియా సంస్థతో బన్నీ మాట్లాడుతూ, 'దువ్వాడ జగన్నాథం' విషయంలో దర్శకుడు హరీష్ శంకర్ కు తాను ఒక్కటే చెప్పానని... ఏ క్రాఫ్ట్ పరంగా చూసుకున్నా 'ది బెస్ట్' అనేలా సినిమా ఉండాలని కోరానని చెప్పాడు.

తాను ఏదైతే కోరుకున్నానో, హరీష్ అదే విధంగా తీశాడని సంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ సినిమా తనకు చాలా ప్రత్యేకమని... ఇన్ని వేరియేషన్స్ ఉన్న పాత్రను, గతంలో తాను ఎన్నడూ పోషించలేదని చెప్పాడు. తాను నటించే ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపించాలని కోరుకుంటానని... అందుకే ప్రతి సినిమాలో తన స్టైల్లో మార్పు కనిపిస్తుంటుందని తెలిపాడు.

  • Loading...

More Telugu News