: విశాఖలో ప్రజలు, వైకాపా కార్యకర్తల మధ్య గొడవ... పోలీసుల నిర్వాకమేనన్న విజయసాయిరెడ్డి


'సేవ్ విశాఖ' పేరిట తాము తలపెట్టిన మహాధర్నాకు అనుమతులు ఇచ్చినట్టే ఇచ్చి, అడ్డంకులు, అవాంతరాలను పోలీసులు సృష్టిస్తున్నారని వైకాపా నేత విజయసాయిరెడ్డి విమర్శించారు. మహాధర్నా జరిగే ప్రాంగణానికి దారితీసే రహదారుల్లో సాధారణ ప్రజల వాహనాలకు, రాకపోకలకు అనుమతిస్తున్న పోలీసులు, వైకాపా కార్యకర్తలను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఈ ఉదయం నుంచి పలు రహదారుల్లో వైకాపా కార్యకర్తలు, స్థానిక ప్రజల మధ్య వాగ్వాదం జరుగుతుండగా, కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

 వాహనదారులు, ప్రజలకు మధ్య గొడవ పుట్టించేలా పోలీసుల వ్యవహార శైలి ఉందని, ధర్నా జరిగే మార్గం ద్వారా రాకపోకలను ఆపి, వారికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపాల్సిన బాధ్యతను పోలీసులు మరిచారని విజయసాయి ఆరోపించారు. కావాలనే ధర్నా ప్రాంతంలో ఉద్రిక్తతను రెచ్చగొట్టాలని పోలీసులు యత్నిస్తున్నారని, తమ పార్టీ కార్యకర్తలు మాత్రం సంయమనం పాటిస్తున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News