: కళ్యాణ్ విమానాశ్రయానికి భూములిచ్చేది లేదు... ఆందోళనకు దిగిన రైతులు... రంగంలోకి దిగిన పోలీసులు
మహారాష్ట్రలోని థానే జిల్లా కళ్యాణ్ పట్టణంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఎయిర్ పోర్టు నిర్మించేందుకు భూసేకరణకు సిద్ధమైంది. అయితే ప్రభుత్వం తమ భూములను బలవంతంగా లాక్కుంటోందని, విమానాశ్రయానికి భూములిచ్చేది లేదని రైతులు స్పష్టం చేశారు. ప్రభుత్వం దిగిరాకపోవడంతో రైతులు రోడ్డెక్కారు. థానే-బదలాపూర్ హైవేని దిగ్బంధించారు. టైర్లకు నిప్పు పెట్టి, రోడ్డుపై వాహనాలను అడ్డుకున్నారు. రాస్తారోకో నిర్వహించారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దించింది.