: శిరీష అలాంటిదే కనుక అయివుంటే ఎస్సైకి సహకరించేది కదా? ఇంత జరిగేదా?: శిరీష బాబాయ్
హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ లో ఆత్మహత్యకు పాల్పడిన శిరీషను వేశ్యగా చిత్రీకరించేందుకు పోలీసులు, మీడియా ఛానెళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని హతురాలి బాబాయి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. తమ బిడ్డ అలాంటిది కాదని ఆయన చెప్పారు. చాలా విషయాలను పోలీసులు దాస్తున్నారని, దర్యాప్తు సమగ్రంగా జరగడం లేదని ఆయన ఆరోపించారు. శిరీష కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తి అని చెప్పారు.
నిందితులు, పోలీసులు, మీడియా చెబుతున్నట్టు రాజీవ్ తో ఆమెకు అక్రమ సంబంధం ఉండి ఉంటే... కుక్కునూరుపల్లిలో ఎస్సైకి సహకరించి ఉండేదని అన్నారు. ఐదు నిమిషాలు ఎస్సైకి సహకరించి ఉంటే ఇంత జరిగి ఉండేదా? అని ఆయన ప్రశ్నించారు. ఆమె వ్యక్తిత్వం గురించి తెలియని పోలీసులు, మీడియా చేస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని ఆయన అన్నారు. ఆమె మెడచుట్టూ నైలాన్ తాడుతో బిగించిన గుర్తులు ఉన్నాయని ఆయన చెప్పారు. నైలాన్ తాడుతో బిగించి చంపి, తరువాత చున్నీతో వేలాడదీస్తే, మెడదగ్గర ఎముకలు విరగవా? అని ఆయన ప్రశ్నించారు. శిరీషది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని ఆయన స్పష్టం చేశారు.