: ఇకపై ఆధార్ ఉంటేనే వెంకన్న దర్శనం!


ఇకపై తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకోవాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి కానుంది. బ్యాంకు ఖాతా, పాన్‌కార్డులకు ఆధార్‌ అనుసంధానాన్ని సుప్రీంకోర్టు ఇటీవల సమర్థించిన నేపథ్యంలో స్వామి వారి దర్శనానికి కూడా ఆధార్ ను మాత్రమే అనుమతించాలని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం నిత్యమూ సుమారు 75 వేల మంది భక్తులు తిరుమలకు వస్తుండగా, వీరిలో 98 శాతం కుటుంబ పెద్దల వద్ద, వెంట వచ్చే వారిలో 94 శాతం మంది వద్ద ఆధార్ కార్డులు ఉన్నాయని లెక్క తేల్చిన అధికారులు, ఆధార్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే అక్రమాలను మరింత సులువుగా అరికట్టవచ్చని భావిస్తున్నారు.

తొలి దశలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవలు, నడకదారి భక్తులకు ఆధార్‌ తప్పనిసరి చేయాలని నిర్ణయించుకున్న అధికారులు, విదేశాల్లో ఉండే వారికి మాత్రం పాస్ పోర్టు నంబరును ఆప్షన్ గా ఇవ్వాలని భావిస్తున్నారు. అయితే, ఆధార్ తప్పనిసరిపై ఇప్పటికిప్పుడు ఒత్తిడి తేబోమని, దీనిపై భక్తుల్లో విస్తృత ప్రచారం నిర్వహించిన తరువాతనే అమలు చేస్తామని అధికారులు అంటున్నారు.

  • Loading...

More Telugu News