: గవర్నర్ నరసింహన్ కు ఐవైఆర్ కృష్ణారావు ఫిర్యాదు
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంఘం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు తన ఫేస్‌బుక్‌లో చేసిన పోస్టులపై కలకలం చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో ఏపీ ప్రభుత్వం ఆయనను పదవి నుంచి కూడా తొలగించింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు గవర్నర్ నరసింహన్ ను కలిశారు. సోషల్ మీడియాలో తాను షేర్ చేసిన పోస్ట్‌లు, తదనంతర పరిణామాలపై ఆయన గవర్నర్‌కు వివరించారు. అలాగే, తనపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని కూడా గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.