: చంద్రబాబుకు ఓటేసిన ప్రతి బ్రాహ్మణుడు లెంపలేసుకుంటున్నాడు: అంబటి రాంబాబు


ఏపీ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి ఐవైఆర్ కృష్ణారావును తొలగించడంపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఐవైఆర్ ను తొలగించడం అన్నది కేవలం బ్రాహ్మణ సమాజం మాత్రమే కాకుండా, యావత్తు సభ్యసమాజం బాధపడే విషయమని అన్నారు. చంద్రబాబుకు ఓటేసిన ప్రతి బ్రాహ్మణుడు లెంపలేసుకుంటున్నాడని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. నీతి, నిజాయతీ గల ఓ అధికారిని టీడీపీ కార్యకర్తలాగో, పార్టీ నేతలాగో వ్యవహరించలేదన్న కారణంతో ఈ పదవి నుంచి తొలగించారని, ‘జన్మభూమి’ కమిటీ సభ్యులకు మాత్రమే లబ్ధి పొందేలా చూడాలని కృష్ణారావుపై ఒత్తిడి తీసుకువచ్చారని ఆయన ఆరోపించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ లో టీడీపీ నేతల జోక్యాన్ని అడ్డుకునే యత్నం చేసినందుకే ఐవైఆర్ పై వేటు వేశారని అన్నారు. 

  • Loading...

More Telugu News