: మార్కెట్లో కూరగాయలు అమ్మే వారితో ముచ్చటించిన మంత్రి కేటీఆర్
సిరిసిల్లా జిల్లాలోని గాంధీనగర్‌లో 55లక్షల రూపాయలతో ఆధునికీకరించిన కూరగాయల మార్కెట్‌ను ఈ రోజు తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం కూరగాయల మార్కెట్‌లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కూరగాయలు అమ్ముతోన్న వ్యక్తులతో కేటీఆర్ ముచ్చటించారు. వారు చేస్తోన్న చిరు వ్యాపార లాభ, నష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు కేటీఆర్.. మేడ్చల్‌లోని గుండ్లపోచంపల్లిలోని అపెరల్ పార్క్‌లో హెల్సా టెక్స్‌టైల్స్‌ను పలువురు మంత్రులతో కలిసి ప్రారంభించారు.