: ప్రధానితో యోగా చేయడానికి వచ్చి అస్వస్థతకు గురైన 75 మంది చిన్నారులు
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ రోజు లక్నోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యోగా కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం అక్కడకు వచ్చిన చిన్నారుల్లో 75 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు ఉదయం 4 గంటల నుంచి ఆ ప్రాంతంలో వాన కురుస్తోంది. ఆ ప్రాంగణానికి ఆ చిన్నారులు నిన్న రాత్రే చేరుకున్నారు. ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతల్లో మార్పు, నిన్న రాత్రి నిద్రలేమితో పాటు చిన్నారులు ఆ వర్షంలో తడిసిపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. వారిని వెంటనే అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అధికారులు వారికి ప్రాథమికి చికిత్స అందించి డిశ్చార్జి చేశారు.