: ఈ సారి బాలీవుడ్‌ నటి నేహా ధూపియా మెడ‌పై క‌త్తిపెట్టేసి బెదరగొట్టిన వరుణ్ ధావన్


భారతీయ సినిమా చరిత్ర రికార్డుల‌ను తిర‌గ‌రాస్తూ ‘బాహుబలి 2’ సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జొహార్ పార్టీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా కట్టప్ప బాహుబలిని చంపిన కత్తిని చేత‌ప‌ట్టుకుని బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ ఆ కత్తితో మ‌రోసారి ప్ర‌భాస్‌ను స‌ర‌దాగా పొడిచేసిన ఫొటో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసింది. అయితే, వ‌రుణ్ ధావ‌న్‌ ఒక్క ప్ర‌భాస్‌నే కాదు, అదే క‌త్తితో మ‌రి కొంద‌రు సెలబ్రెటీలను కూడా స‌ర‌దాగా బెదిరించాడు. బాలీవుడ్‌ నటి నేహా ధూపియా మెడ‌పై క‌త్తిపెట్టేసి బెదరగొట్టాడు. ఈ ఫొటోను నేహా తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. 

  • Loading...

More Telugu News