: ఎవరేమన్నా 2019లో సీఎం జగనే: మేకపాటి


మరో రెండేళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ ఆశయసాధనే లక్ష్యంగా రాజకీయాల్లో అడుగుపెట్టిన వైకాపా అధినేత వైఎస్ జగన్ సీఎం కావడం ఖాయమని ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌ రెడ్డి ధీమాగా చెప్పారు. తన స్వగృహంలో వైసీపీ ప్లీనరీ ఏర్పాట్లపై సమీక్షించిన ఆయన, అధికార పక్షం ఎన్ని విమర్శలు చేసినా, ప్రజలు తమవైపే ఉన్నారని అన్నారు. టీడీపీ మాయ మాటలతో ప్రజలను మభ్య పెడుతోందని, వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. శనివారం 24వ తేదీన ఆత్మకూరులో జరిగే వైకాపా ప్లీనరీకి కార్యకర్తలందరూ రావాలని పిలుపునిచ్చిన ఆయన, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు పర్యటనలు చేపట్టనున్నట్టు తెలిపారు. పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారులు తదితర సమస్యలపై అధికారులతో చర్చించనున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News