: కేబీఆర్ పార్కులో యోగాసనాలు వేసిన బాలయ్య... అభిమానుల హర్షం


అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ యోగా ఆచరించారు. హైదరాబాదులోని కేబీఆర్ పార్కులో ఆయన పలువురితో కలిసి యోగాసనాలు వేశారు. యోగా గురువు సూచనలను యథావిధిగా ఆచరిస్తూ బాలయ్య ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ  అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఇతర సినీ నటులకు భిన్నంగా అందరితో కలిసి యోగాసనాలు వేసిన ఏకైక వ్యక్తి అని అభినందించారు. ఉత్సాహవంతులు జై బాలయ్య అంటూ నినాదాలు చేయగా, ఆయన వారిని వారించారు. 

  • Loading...

More Telugu News