: అమ్మకానికి టీవీ-9... పోటీలో 4 కంపెనీలు!


తెలుగు టీవీ న్యూస్ చానల్స్ లో అగ్రగామి టీవీ-9ను విక్రయానికి ఉంచినట్టు తెలుస్తోంది. టీవీ-9 పేరిట తెలుగు, కన్నడ, గుజరాతీ, మరాఠీ, ఆంగ్ల భాషల్లో వార్తా చానల్స్ నిర్వహిస్తున్న అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ (ఏబీసీఎల్) నుంచి మెజారిటీ వాటాలను విక్రయించేందుకు చర్చలు సాగుతుండగా, నాలుగు మీడియా సంస్థలు టీవీ-9 బ్రాండ్ కోసం ఆసక్తిని చూపుతున్నాయని, మరో నెల రోజుల్లో చర్చలు పూర్తి కావచ్చని సమాచారం. ప్రస్తుతం ఏబీసీఎల్ లోని 80 శాతం వాటాలు చింతలపాటి శ్రీనిరాజు ఆధ్వర్యంలో నడుస్తున్న పీపుల్ క్యాపిటల్ ఎల్ఎల్సీతో పాటు, యూఎస్ కు చెందిన పీఈ (ప్రైవేటు ఈక్విటీ) సంస్థ సైఫ్ పార్ట్ నర్స్ వద్ద ఉండగా, మిగతా వాటా సంస్థ సీఈఓ రవిప్రకాష్ తదితరుల వద్ద ఉంది.

ప్రస్తుతం ఆర్థిక సేవలందిస్తున్న డెల్లాయిట్, కేపీఎంజీ, ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థలు ఏబీసీఎల్ విలువను లెక్కిస్తుండగా, జీటీవీ సహా మరో 3 మీడియా కంపెనీలు టీవీ-9 కోసం చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్థిక సంస్థల నివేదిక ప్రకారం, ఏబీసీఎల్ కోసం దాఖలయ్యే బిడ్ లో అత్యధిక ధరను కోట్ చేసిన కంపెనీకి అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ లో 80 శాతం వాటా దక్కనుంది. ఇక టీవీ-9 బ్రాండ్ విలువ రూ. 850 కోట్ల నుంచి రూ. 1000 కోట్ల మధ్య ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News