: బీజేపీ పాగా వేసింది... మూడు దశాబ్దాల తర్వాత సిమ్లాలో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను చేజిక్కించుకున్న కమలం పార్టీ!
మూడు దశాబ్దాల తర్వాత సిమ్లాలో భారతీయ జనతా పార్టీకి అద్భుత విజయం దక్కింది. మంగళవారం సిమ్లా మునిసిపల్ కార్పొరేషన్ మేయర్‌గా కుసుమ్ సద్రెత్, డిప్యూటీ మేయర్‌గా రాకేష్ శర్మ ఎన్నికయ్యారు. జూన్ 17న ఇక్కడ జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో 34 సీట్లకు గాను 17 సీట్లను బీజేపీ గెలుచుకుంది. మెజారిటీకి ఒక్క సీటు దూరంలో నిలిచింది. బీజేపీ రెబల్‌గా బరిలోకి దిగి విజయం సాధించిన శర్మ తిరిగి పార్టీ గూటికి చేరడంతో బీజేపీ ఆధిక్యం సంపాదించింది. ఫలితంగా మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఆ పార్టీ సొంతమయ్యాయి. ఈ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగనప్పటికీ కాంగ్రెస్, బీజేపీలు మాత్రం తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించాయి. కాగా, సిమ్లాలో 2012 వరకు కాంగ్రెస్ ఏకధాటిగా 26 ఏళ్లపాటు అధికారాన్ని చెలాయించింది.