: యోగా వేడుకలు షురూ... ప్రపంచ రికార్డు నమోదు!
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా యోగా వేడుకలు ప్రారంభమయ్యాయి. లక్నోలో నిర్వహించిన యోగా వేడుకల్లో ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. వీరితో పాటు 55 వేల మంది యోగాసనాలు వేశారు. అహ్మదాబాద్ లో ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా యోగాసనాలు వేయించారు. ఈ శిబిరానికి 4 లక్షల మంది హాజరయ్యారు. దీంతో ప్రపంచ రికార్డు నమోదైంది. న్యూయార్క్, లండన్, పారిస్ సహా సుమారు 200 దేశాల్లో యోగాదినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. వరుసగా మూడో ఏడాది యోగా వేడుకలు ఘనంగా జరగడం ఆనందంగా ఉందని, యోగాడేలో పాల్గొంటున్న వారందరికీ శుభాకాంక్షలని ప్రధాని మోదీ తెలిపారు.