: టీడీపీ నాయకులు, రెవెన్యూ అధికారులు కలిస్తే భూ కబ్జాలే: విజయసాయిరెడ్డి
టీడీపీ నాయకులు, రెవెన్యూ అధికారులు కలిస్తే భూకబ్జాలేనంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కబ్జా చేసిని ప్రతి భూమిని వెనక్కి తెచ్చే వరకు పోరాటం చేస్తామని, సోషల్ మీడియాలో సహేతుకమైన విమర్శలను స్వీకరించే స్థితిలో ప్రభుత్వం లేదని ఆరోపించారు. జులై 22న తమ పార్టీ చేపట్టనున్న మహాధర్నా తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని, తమకు పోటీగా టీడీపీ ధర్నా చేస్తామనడం అర్థరహితమని, ప్రభుత్వంలో ఉన్న వాళ్లే ధర్నా చేస్తామనడం విడ్డూరంగా ఉందని విజయసాయిరెడ్డి విమర్శించారు.