: శ్రీలంకలో టీమిండియా పర్యటన ఖరారు!


టీమిండియా శ్రీలంక పర్యటన ఖరారైంది. వ‌చ్చేనెల 26 నుంచి శ్రీలంకతో భార‌త్‌ టెస్టు సిరీస్ ప్రారంభ‌మవుతుంది. టెస్టు మ్యాచ్‌లు ముగిసిన త‌రువాత‌ ఆగస్టు 20 నుంచి వన్డేలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబరు 6న టీ20 మ్యాచ్ ఆడుతుంది. కాగా, వెస్టిండిస్‌లో భార‌త జ‌ట్టు ప‌ర్య‌ట‌న ఇప్ప‌టికే ఖ‌రారైన విష‌యం తెలిసిందే. వెస్టిండీస్‌ జట్టుతో టీమిండియా ఈ నెల 23 నుంచి ఐదు వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడనుంది. వెస్టిండీస్ పర్యటన కోసం ఇప్పటికే భార‌త్ కరీబియన్ చేరుకుంది. వెస్టిండీస్‌తో సిరీస్ ముగిసిన అనంతరం శ్రీలంక‌కి వెళ్లనుంది.

ఛాంపియన్స్ ట్రోఫీలో చక్కగా ఆడి ఫైనల్ వరకు వెళ్లిన టీమిండియా.. పాకిస్థాన్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. వెస్టిండీస్ ర్యాంకింగ్స్ లో వెనుకబడి ఉండడంతో ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడడానికి అర్హత సాధించలేకపోయింది. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశ మ్యాచుల్లో శ్రీలంక చేతిలో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే.       

  • Loading...

More Telugu News