: రొమాన్స్ లో 'మునిగి' ప్రేమజంట దుర్మరణం!


కారులోని ఓ ప్రేమజంట ఊహించని రీతిలో దుర్మరణం చెందిన సంఘటన రష్యాలోని వోలోగ్రాడ్ లో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. ఓ పాఠశాలలో ఎవిజనీ చెర్నోవ్ (22) పీఈటీగా పని చేస్తున్నాడు. అతని ప్రియురాలు యానా క్ర్యుచ్ కోవా (22). వీరిద్దరూ కలిసి నిన్న విహారయాత్రకు వెళ్లారు.

 ఈ క్రమంలో వోల్ గ్రాడ్ శివారులోని ఓ సరస్సు గట్టుమీద కారు ఆపి కొంచెం సేపు మాట్లాడుకున్నారు. ఆపై వెనుక సీట్లోకి వెళ్లిన ఈ ప్రేమ జంట రొమాన్స్ లో మునిగిపోయింది. ఈ క్రమంలో ‘న్యూట్రల్’ లో ఉన్న కారు గేరు మారడం, సరస్సులోకి అది దూసుకెళ్లడం జరిగింది. నీట మునిగిన కారు నుంచి ఆ ప్రేమజంట బయటపడలేకపోవడంతో అందులోనే ప్రాణాలు వదిలారు. కాగా, స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. మృతుల కుటుంబాలకు ఈ సమాచారం తెలిపారు.

  • Loading...

More Telugu News